ఆర్థికపరమైన విషయాలపై తెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు

. బ్యాంక్ ఖాతా ఉచితం కాదు!

👉 చాలామంది “జీరో బ్యాలెన్స్ ఖాతా” అనగానే నిజంగా ఖర్చులేనిదే అనుకుంటారు.

అయితే కొన్ని సర్వీసులకి (ATM usage, SMS alerts) బ్యాంకులు చార్జ్ చేస్తాయి.

💡 పాయింట్: ఖాతా ఓపెన్ చేసే ముందు Terms చదవాలి.

2. క్రెడిట్ కార్డు డ్యూస్ రాకపోతే పెద్ద బిల్లవుతుంది!

👉 క్రెడిట్ కార్డు ఉపయోగించడమొక అర్థవంతమైన పని. కానీ చెల్లింపులు ఆలస్యం అయితే అధిక వడ్డీ, పైనాల్టీలు వస్తాయి.

💡 పాయింట్: ప్రతి నెల EMI లేదా Full Payment టైం కి చెల్లించాలి.

3. FDలు 100% సేఫ్ అనుకోవడం తప్పు!

👉 ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)లు సేఫ్ అనిపించినా, 5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ ఇన్సూరెన్స్ ఉంటుంది.

💡 పాయింట్: పెద్ద మొత్తం అయితే, వాటిని విభజించి పెట్టుకోవాలి.

4. PAN కార్డు లేని ట్రాన్సాక్షన్లు పరిమితంగా ఉంటాయి

👉 పెద్ద మొత్తాల బ్యాంక్ లావాదేవీలకు PAN కార్డు తప్పనిసరి.

💡 పాయింట్: FDలు, మ్యూచువల్ ఫండ్లు, షేర్లు మొదలైనవి PAN తోనే చేయాలి.

5. SIP (Systematic Investment Plan) చిన్న మొత్తాలతో గొప్ప భవిష్యత్తు

👉 SIP ద్వారా ప్రతి నెల కొంత మొత్తాన్ని పెట్టుబడి చేయవచ్చు. ఇది compound interest వల్ల పెద్ద మొత్తంగా మారుతుంది.

💡 పాయింట్: చిన్నగా మొదలుపెట్టి, సుదీర్ఘకాలంగా కొనసాగిస్తే మంచి Returns వస్తాయి.

గృహిణుల కోసం డబ్బు సంపాదించే మార్గాలు


🥘 వంటలో నైపుణ్యం ఉన్న గృహిణుల కోసం

  1. ఇంట్లో తయారు చేసిన భోజనం – ఇంటి వంటలు, టిఫిన్స్, కర్రీ పాయింట్ పెట్టడం
  2. పప్పులు, పచ్చళ్లు, పిండివంటలు తయారు చేసి అమ్మడం
  3. బేకింగ్ బిజినెస్ – కేకులు, బిస్కెట్లు, స్వీట్లు ఇంట్లో తయారు చేసి అమ్మవచ్చు.

✂️ చేతిపనుల్లో నైపుణ్యం ఉన్న గృహిణుల కోసం

  1. కుట్టు పనులు (టైలరింగ్) – జాకెట్లు, పంజాబీ డ్రెస్స్‌లు, కుర్తీలు.
  2. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ – క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్, పేపర్ డెకరేషన్స్ అమ్మడం.
  3. జ్యువెలరీ మేకింగ్ – ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చేసి ఆన్‌లైన్ లేదా లోకల్‌గా అమ్మడం.

💻 టెక్నాలజీ వాడగల గృహిణుల కోసం

  1. ఆన్‌లైన్ ట్యూటరింగ్ – ట్యూషన్, సంగీతం, భాషలు నేర్పడం.
  2. కంటెంట్ రైటింగ్ – వెబ్‌సైట్స్‌కి కథలు, ఆర్టికల్స్ రాయడం.
  3. ఫ్రీలాన్సింగ్ – డేటా ఎంట్రీ, డిజైన్, ట్రాన్స్‌లేషన్ వంటి పనులు.
  4. యూట్యూబ్ ఛానల్ – వంట, హోమ్ టిప్స్, అందానికి చిట్కాలు, vlogs వీడియోలు చేసుకోవచ్చు.



      👉 ముఖ్యంగా గృహిణులు తమకు ఇష్టమైన పని + తమకు ఉన్న నైపుణ్యం కలిపి చేస్తే, పని ఆనందం, ఆదాయం రెండూ ఉంటాయి


      బడ్జెట్ ని పిల్లలకి అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలి

      📘 కథ పేరు: చిన్నారి చిట్టి & బడ్జెట్ పుస్తకం

      ాకినాడలో చిట్టి అనే బుజ్జి అమ్మాయి ఉండేది. తను దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాల కి వెళ్తూ ఉండేది. చిట్టి చాలా పెద్ద పెద్ద బొమ్మలు కొనుక్కోవాలి అనుకునేది.

      కానీ వాళ్ల నాన్న అన్ని డబ్బులు ఇచ్చేవారు కాదు, తాతయ్య మాత్రం డబ్బులు దాచుకోమని చెప్తూ ఉండేవారు, –
      “మనకి ఎంత డబ్బు వస్తుందో, ఎంత ఖర్చవుతుందో రాసుకుంటే, మిగిలిన డబ్బుతో పెద్ద పనులు చేయవచ్చు” అని.

      ఒకసారి చిట్టి పాఠశాల పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంది, అందుకు వాళ్ల తాతయ్య ఐదు వేల రూపాయలు బహుమతి గా ఇచ్చారు, తాతయ్య “బడ్జెట్ పుస్తకం” కొని ఇచ్చాడు,
      “ఈ డబ్బుతో నెలకి కావాల్సినవి కొనుక్కో చిట్టి. నువ్వు పెట్టే ఖర్చు ఈ పుస్తకంలో వ్రాయి, చివరికి ఎంత మిగులుతుందో చూద్దాం.” అని చెప్పారు.

      చిట్టి ఏం చేసిందంటే…

      🧾 చిట్టి “బడ్జెట్ పుస్తకం” తెరిచింది!

      ఆ పుస్తకంలో ఇలా రాసింది:

      తేదీఖర్చు పేరుఖర్చు మొత్తం
      1వ తేదీపుస్తకం కొనుగోలు₹200
      2వ తేదీఐస్‌క్రీమ్₹50
      5వ తేదీపెన్సిల్ బాక్స్₹100
      7వ తేదీబలూన్లు₹30

      అలా ఒక్కో రోజు ఏం ఖర్చు చేసిందో రాసుకుంటూ పోయింది.

      ఒక 10 రోజుల తర్వాత చిట్టికి ఒక ఆటబొమ్మ అచ్చంగా నచ్చింది. ధర ₹700.

      కానీ అప్పటికే చిట్టి ₹3000 ఖర్చు చేసిందని చూసింది.

      ఆమెకు గుర్తొచ్చింది:
      “నాకు ఈ ఆటబొమ్మ కావాలి అంటే, నేను ఐస్‌క్రీమ్ తినడాన్ని, అక్కర్లేని బలూన్లు కొనడాన్ని తగ్గించాలి”

      💡 అప్పుడు చిట్టికి అర్థమైంది:

      బడ్జెట్ రాసుకుంటే మనకు ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందో , ఏం తగ్గించాలో తెలుస్తుంది మిగిలిన డబ్బుతో మనం ఇష్టమైన పెద్ద వస్తువు కొనచ్చు అని తాతయ్య చెప్పిన మాట గుర్తు వచ్చింది,

      చివరికి చిట్టి ఐస్‌క్రీమ్ తగ్గించింది, కొత్త పుస్తకాలు బదులుగా పాతవి చదివింది.
      మొదటి నెలలోనే ఆమె ₹1500 సేవ్ చేసింది.
      రెండో నెలలో ఆ డబ్బుతో ఆ ఆటబొమ్మ కొంది – నవ్వుతూ తాతయ్యకు చూపించింది.


      🎉 ముగింపు సందేశం:

      ఈ కథ పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకి కూడా వర్తిస్తుంది,
      చిట్టిలా మీ ఖర్చులను చిన్న పుస్తకంలో రాసుకుంటే, మీకు అవసరమైన పెద్దవాటిని కొనగలరు.
      బడ్జెట్ అంటే మనం డబ్బును తెలివిగా వాడటం.
      ఖర్చు చేయడంలోనే కాదు – పొదుపు చేయడంలోనూ ఆనందం ఉంది!


      LIC ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి

      హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఒక వారం రోజులు మనకి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఉంటుంది ఈలోపు సరేలే ఏముందిలే అనుకుంటారు చాలా మంది మెల్లిగా ప్రిపేర్ అవుతాము పెద్ద ఇంపార్టెంట్ క్యూస్షన్స్ ఏమి రావు ఈజీనే అనుకుంటారు కానీ నా స్వా అనుభవం నేను ఎగ్జామ్ హాల్ లో ఉన్నప్పుడు నాతోపాటు రాసిన ఐదుగురు ఫెయిలయ్యారు మొత్తం మార్కులు 50 మార్కులకు అయితే వాళ్లకి కనీసం 15 మార్కులు కూడా రాని వాళ్ళు ఐదుగురు ఉన్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ సరిగ్గా ప్రిపేర్ అవుతే కచ్చితంగా ఎల్ఐసి ఎగ్జామ్ పాస్ అవుతారు ఎల్ఐసి ఎగ్జామ్ పాస్ అవ్వడానికి వివిధ రకాల టిప్స్ ఈ ఆర్టికల్లో మనం చూద్దాం

      ఎల్ఐసి ఎగ్జామ్ అనేది ముఖ్యంగా ఇన్సూరెన్స్ అలాగే వినియోగదారుడు అలాగే ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీ విషయాల్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ముఖ్యంగా తెలియజేస్తుంది అలాగే ఈ ఎగ్జామ్ లో అడిగే క్యూస్షన్స్ అన్ని దానికి రిలేట్ అయ్యే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన మనం కొన్ని క్యూస్షన్స్ ఏ విధంగా నేర్చుకోవాలంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ ఇయర్లో మెడికల్ ఇన్సూరెన్స్ ఇటువంటివి కొత్తగా ప్రవేశపెట్టారు అలాగే ఎక్కడ మొదటగా ప్రవేశపెట్టారు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి అలాగే కొన్ని ఎనీ టైం ప్రతిసారి వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి వాటిని కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి వీటి కోసం నేను కొన్ని టిప్స్ చెప్తాను ఉదాహరణకి కొన్ని యూట్యూబ్ వీడియోలో నేను ఫాలో అయిన వీడియోలో కచ్చితంగా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 80% ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ వీడియోలో ఉన్నది నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ లో పాస్ అవ్వచ్చు కచ్చితంగా నేను చెప్తున్నాను అలాగే మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఎగ్జామ్స్ గురించి నేను ఒక ఎగ్జామ్ బుక్కు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్లిప్కార్ట్ లో ఉంటది మీకు నచ్చితే కనుక డౌన్లోడ్ చేసుకోండి లేదా బుక్ కొనుక్కోండి మీకు 100% హామీ ఇస్తున్నాను కచ్చితంగా మీరు పాస్ అవుతారని మీకు నచ్చితే గనుక బొట్టు కొనుక్కోండి అయితే ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ సంబంధించిన వీడియోలు లింక్ ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను మీరు వీటిని ఫాలో అవ్వండి

      LIC ఏజెంట్ అవ్వడం ఎలా

      LIC ఏజెంట్ అవ్వాలని చాలామంది అనుకుంటారు తద్వారా వాళ్లకి జీవన ఉపాధి అలాగే వేరే వినియోగదారులకి ఒక ఉపయోగపడే విధంగా ఉంటామని అనుకుంటారు, ఎలా జాయిన్ అవ్వాలో తెలియని పరిస్థితి అయితే మనం ఏ విధంగా జాయిన్ అవ్వచ్చు తెలుసుకుందాం,

      ముందుగా LIC వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి తర్వాత పేమెంట్ సెక్షన్ లోకి వెళ్లి EXAM ఫీజు PAY చేయాలి ఆ తర్వాత మనకంటూ ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది మనకు ఒక హాల్ టికెట్ కూడా వస్తుంది. ఎప్పుడు ఎగ్జామ్ ఉంది ఎక్కడ ఉన్నావు అందులో చూపిస్తారు మనకి మెయిల్ ఐడికికూడా మెయిల్ వస్తుంది అప్పుడు మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అవుతారు కానీ అందులో 40% ఫెయిల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చదివేది వాళ్ళు అనుకున్నది ఏది ఇంపార్టెంట్ కాకుండా ఏది పడితే అది చదివేసి ఆ ప్రశ్నలు ఎగ్జామ్లో రాక సరిగ్గా రాయలేక ఫెయిల్ అవుతున్నారు. సో దీనికోసం అని మనం ఒక ప్రయత్నం చేద్దాం

      ఎల్ఐసి ఇండియా వెబ్సైట్లోకి మనం వెళ్లాక ఎల్ఐసి ఆఫర్ చేసే ప్లాన్లు కనిపిస్తాయి, అలాగే కిందికి స్క్రోల్ చేస్తే అప్పుడు మనకు ఒక చిన్నగా పేజీ లాగా కనిపి స్తుంది అదే ఏజెంట్ నీకు ఏజెంట్ అవ్వాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని క్లిక్ బటన్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు తర్వాత పేజీలో మీ పేరు మీ ఇంటి పేరు, మీ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఫిల్ చేస్తే సరిపోతుంది , తరువాత సబ్మిట్ చేయాలి

      ఈ విధంగా అప్లై చేసి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకొక ఆర్టికల్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం.